అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు... అన్నం మనిషి ప్రాణాన్ని నిలిపితే ఆ ప్రాణానికి దిసా నిర్దేశం చేసేది అక్షర జ్ఞానము .... ఇది మనిషికి నీతి వంతమైన జీవితాన్ని ప్రసాదిస్తుంది అందుకే అక్షరం సైతము పరబ్రహ్మ స్వరూపమే ఈ విశ్వాన్ని సృష్టించిన బ్రహ్మే అక్షర స్వరూపమైన సరస్వతీ దేవినీ సృష్టించాడు.... సరస్వతీ కటాక్షం లేని మానవుడి జీవితం నిరర్ధకం....సరస్వతీ దేవి వాహనమైన హంస కి పాలని నీళ్ళని వేరు చేయాగల గునమున్నట్లే సరస్వతీ కటాక్షం ఉన్న మనిషికి మంచి చెడులను వేరు చేయా గల విచక్షణ కలుగుతుంది...... అందుకే ప్రతి పిల్లవాడికి పెద్దలు చిన్నప్పుడే అక్షరాభ్యాసం కావిస్తారు
నిరక్షరాస్యత ప్రబలంగా ఉన్న సమాజం లో అనేక రకాలైన సమస్యలు కూడా వుంటాయి... ఎందరో మహానుభావుల కృషి వల్ల నేడు ఆడవారు సైతం ఉన్నత విద్యలు అభ్యసిస్తున్నారు ( ఒక్కప్పుడు వీరు విద్య నుంచి దూరం కావించపడ్డారు)
నేడు చదువు పట్ల అందరిలోనూ అవగాహన పెరిగింది... తాము చడువుకోలేక పాయినా... తమ పిల్లల్ని విద్యావంతులు కావించాలని చాలా మంది తపన పడుతున్నారు....కాని ఈ రోజులలో విద్య ఒక వ్యాపారంగా మారిపోయింది... ఒకప్పుడు చదువు చెప్పిన గురువుకి విద్యార్ధి గురుదక్షిణ ఇచ్చుకొనే వాడు..... ఈ రోజున.. నేర్చుకునే విద్య కంటే ఆ దక్షిణ కే విలువ పెరిగింది... దీని వల్ల అక్షర జ్ఞానాన్ని పొందాలని తపన ఉన్నవారు సైతం.... ఆ అక్షర లక్షలు చెల్లించి చడువుకోలేక ఆగిపోతున్నారు...అన్ని దానాలలోకి అన్నదానం మిన్న అంటారు .... అన్నం ఒక పూట ప్రాణాన్ని నిలిపితే అక్షరం పూర్తి జీవితాన్ని నిలుపుతుంది ... కనుకే ... అన్న దానానికన్న అక్షర దానం ఇంకా ఉత్క్రుస్తామైనదిచడువుకోవాదానికి ఆర్ధిక ఇబ్బందులు తో సతమతం అయ్యేవారికి ఆలంబన గా నిలవడానికి ఏర్పాటైన అక్షర లో సభ్యులందరికీ జోహారులు....
ఎందరో మహానుభావులు.... అందరికి అక్షరాంజలి